- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పట్లో ఎడ్లబండ్ల ప్రదర్శన.. ఇప్పుడు ట్రాక్టర్లు
బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరూ వినే ఉంటాం.

దిశ,తాడ్వాయి : బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరూ వినే ఉంటాం. ఎడ్ల బండ్లకు ఉన్న ప్రాధాన్యత,దానికున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరాది ఉగాది వచ్చిందంటే చాలు.. గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఎడ్లబండ్ల ప్రదర్శనలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చేస్తాయి. ప్రతి గ్రామంలో ఎడ్లను, బండ్లను శుభ్రంగా కడిగి, మామిడి తోరణాలు రకరకాల పూలతో అందంగా వివిధ రూపాలలో అలంకరిస్తారు. వివిధ రకాల చీరలను కట్టి గ్రామీణ ప్రాంత వాతావరణం ఉట్టిపడే విధంగా, ఎడ్ల బండిని తయారుచేసి, గ్రామంలోని ఆలయాల చుట్టూ పండుగ సందర్భంగా తిప్పుతూ, ఘనంగా ఉగాది పర్వదినాన్ని జరుపుకునేది. అటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా తగ్గిపోయి, వ్యవసాయ యాంత్రికరణ దినదినం చాప కింద నీరుల విస్తరించడంతో.. ప్రస్తుతం ఎడ్లతోపాటు, బండ్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితి దాదాపుగా వచ్చింది. భావితరాలకు ఎడ్ల బండి అంటే ఒకప్పుడు ఈ విధంగా ఉండేదని, దాంతోనే వ్యవసాయం చేసే వారమని చెప్పుకునే పరిస్థితి ఏర్పడనుంది.
పల్లెల్లో ఎడ్లబండ్ల జాడ కరువైంది
ఉగాది పండుగ వచ్చిందంటే పల్లెల్లో ప్రధానంగా కనిపించేది ఎడ్లబండ్ల ప్రదర్శనలే.. అలాంటిది పల్లెల్లో ఇప్పుడు ఎడ్లబండ్ల జాడనె కరువైపోయింది. ఎడ్ల బండ్లు ఉన్న రైతుకు ఏడాదంతా పని ఉండేది. అలాంటిది పల్లెల్లోకి ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు రావడంతో.. ఎడ్ల బండ్లు ఉన్న రైతుకు పని లేక ఇప్పుడు గుండెలు బరువయ్యాయి. కొన్ని పల్లెల్లో మాత్రమే ఒకటి లేదా రెండు ఎడ్ల బండ్లు మాత్రమే కనిపించే పరిస్థితులు గ్రామాలలో నెలకొన్నాయి. దీంతో రైతు ఎడ్లతో వ్యవసాయం చేయడం మానుకొని అందరిలాగే, ఎడ్ల బండ్లు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితులలో ఆ వ్యవసాయ యాంత్రికరణతోనే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆలయాల చుట్టూ బండ్లు తిప్పుతూ ఉగాది పర్వదినం యొక్క గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
ఎడ్లబండ్ల ప్రదర్శన చెయ్యాలంటే డ్రా తీయాల్సిందే
ఒకప్పుడు పల్లెల్లో ఉగాది పండుగ వచ్చిందంటే పల్లెల్లో ఎడ్ల బండ్ల ప్రదర్శన చేయడానికి తీవ్రమైన పోటీ ఉండేది. ఒక్కరోజు ముందుగానే ఒక గ్రామంలో ఎడ్లబండ్ల ప్రదర్శన చేసేవారు ఊరు పొలిమేరలో చిట్టీలు వేసి మరీ ప్రదర్శన చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తుండే. మరి కొన్ని గ్రామాలలో ఎడ్లబండ్ల వరుసలో తేడా వస్తే కూడా గొడవలు జరిగిన సందర్భాలు సైతం చూశాం. అలాంటిది ఇప్పుడు ఊర్లో ఒకరిద్దరికి ఎడ్లబండ్లు ఉంటే వారికి డబ్బులు ఇచ్చి మరి ప్రదర్శన చేస్తున్నారంటే ఎడ్లబండ్లు ఏ మేరకు కనుమరుగయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
నేడు ట్రాక్టర్ల ప్రదర్శనతో పండుగ సంబరాలు
ఉగాది పండుగ రోజు ఎడ్లబండ్ల ప్రదర్శన వ్యవసాయ సంస్కృతిక,పంటల కాలం ప్రారంభానికి సూచికగా తెలియజేస్తుంది. అలాంటిది పల్లెలో ఎడ్లబండ్లు రోజు రోజుకు కనుమరుగు అవుతుండడంతో.. పల్లెల్లో ట్రాక్టర్ల ద్వారా ప్రదర్శన చేస్తూ పండుగను జరుపుకుంటున్నారు. వ్యవసాయ యంత్రాల రాకతో వ్యవసాయం పనులు సులభంగా జరుగుతున్నాయి. దీంతో ఎడ్లబండ్ల అవసరాన్ని తగ్గించింది. దీంతో తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడానికి ట్రాక్టర్లు ముఖ్య భూమిక పోషించడం పల్లెల్లో ట్రాక్టర్ల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఉగాది పండుగ రోజు ట్రాక్టర్లతో గుడి చుట్టూ ప్రదర్శన చేస్తుండడంతో.. ప్రజలు ఉత్సాహంగా చూసేందుకు విముకుత చూపుతున్నారు. దీంతో పల్లెల్లో ఒకప్పటి పండగ వాతావరణం కనిపించకపోవడం విశేషం.






