- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరిలో నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన
చింరాజ్ పల్లి గ్రామ పంచాయతీ భవనంలో సోమవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరిలో నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన

దిశ,నందిపేట్: చింరాజ్ పల్లి గ్రామ పంచాయతీ భవనంలో సోమవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరిలో నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి చావులమద్ది రాజేష్ మాట్లాడుతూ రైతులకు డిఎస్ఆర్ పద్ధతి, తడి–పొడి విధానం, డ్రమ్ సీడర్ పద్ధతి గురించి వివరించారు. ఈ పద్ధతుల ద్వారా వరి సాగులో కూలీల కొరతను అధిగమించి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. అలాగే వరి సాగులో నీటిని ఆదా చేసుకునే పద్ధతులను రైతులు అలవాటు చేసుకోవాలని సూచించారు.
వరిలో కలుపు తొలగించిన తర్వాత “పొట్ట దశ” వచ్చే వరకు ఎక్కువ నీరు అవసరం ఉండదని, కేవలం 45 తడులతో తడి–పొడి విధానం పాటించి సాగు చేయవచ్చని చెప్పారు. నీరు వృథా కాకుండా పంట చివరి దశ వరకు పొలాలకు సరిపడా సాగునీరు అందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తోట దేవేందర్, చిన్నారెడ్డి, జగన్ మోహన్ రావు, తోట రవీందర్, వి. గంగాధర్, తోట రవి, సురేష్, వినేష్, మల్లేష్, తోట బ్రహ్మయ్య, పోసెట్టి, సాయిలు, శ్రీనివాస్, కిసాన్ తదితరులు పాల్గొన్నారు.






