- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ప్రేమలు మోసాలు' పై విద్యార్థినుల కు అవగాహన
దిశ, మాచారెడ్డి : 'ప్రేమలు మోసాలు' పై పోలీస్ కళా బృందం, వివిధ నేర నియంత్రణ విభాగాలు మండలం లోని ఆరేపల్లి కేజీబీవి విద్యార్థినుల కు గురువారం అవగాహన

దిశ, మాచారెడ్డి : 'ప్రేమలు మోసాలు' పై పోలీస్ కళా బృందం, వివిధ నేర నియంత్రణ విభాగాలు మండలం లోని ఆరేపల్లి కేజీబీవి విద్యార్థినుల కు గురువారం అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లపై అవగాహన కల్పించారు. నేటి యువత గంజాయి, డ్రగ్స్ మత్తులో వివిధ నేరాలకు పాల్పడుతున్న విషయాలను వివరించారు. వారి పట్ల ఏవిధంగా జాగ్రత్తలు పాటించాలి? షీ టీమ్స్ సహాయం, పోలీస్ అత్యవసర సేవల వినియోగంతో ఎంత భద్రత ఉంటుందో వివరించారు. అత్యవసర సేవల ఫోన్ నెంబర్లను నోట్ చేయించారు. యూ ట్యూబ్, ఇన్స్ట్రాగ్రాం, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ను జాగురూకతతో వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి షి టీమ్స్ సభ్యులు సౌజన్య, భూమయ్య, రాజేందర్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు, మాచారెడ్డి ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్ మైస కళ పాల్గొన్నారు.






