కామారెడ్డి జిల్లాలో ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

by Nallavelli.Anjaneyulu |

ఆటో బోల్తా ప‌డి 15 మందికి గాయాలైన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఎదుట చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

కామారెడ్డి జిల్లాలో ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
X

దిశ, కామారెడ్డి : ఆటో బోల్తా ప‌డి 15 మందికి గాయాలైన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఎదుట చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లింగంపేట మండ‌లం సురాయిప‌ల్లి తండాకు చెందిన 15 మంది వ్య‌వ‌సాయ కూలీలు వ‌రినాట్లు వేయ‌డానికి భిక్క‌నూరు మండ‌లం అంతంప‌ల్లి గ్రామానికి వ‌చ్చారు. వ‌రి నాటు వేసి తిరిగి సాయంత్రం ఆటోలో వెళ్తుండ‌గా కామారెడ్డి లోని ఎస్ఆర్ గార్డెన్ ఎదుట ఆటో బోల్తా ప‌డింది. దీంతో ఆటోలో ప్ర‌యాణిస్తున్న 15 మందిలో ఐదుగురికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. మిగ‌తా వారికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు 108 అంబులెన్స్ కి ఫోన్ చేయ‌గా.. స్పందించిన అంబులెన్స్ పైలెట్ ప్ర‌శాంత్, ఈఎంటీ అనీల్ గాయ‌ప‌డిన వారిని హుటాహుటిన కామారెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story