- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోలు, బైక్ దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఆటోలు, బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిజామాబాద్ పోలీస్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఆటోలు, బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తెలిపారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేసి, 9 ఆటోలు, మూడు మోటార్ బైక్ ల స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేఖ్ ఫాజిల్, మహ్మద్ నవాజ్, షేఖ్ అలీ, అలీమ్, మహ్మద్ వాహిద్ లనే ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడి తాముంటున్న ప్రాంతంతో పాటు , ఇతర ప్రాంతాల్లోనూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగిలించిన ఆటోలు, బైక్ లకు ఉన్న ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్లను చెరిపేసి వాటిని జగిత్యాల్ ప్రాంతంలోని మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్ లనే ఇద్దరు వ్యక్తుల ద్వారా కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతంలో విక్రయిస్తున్నారు. దొంగ వాహనాలనే విషయం తెలిసి కూడా తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో వారు ఈ దొంగ వాహనాలను కొనుగోలు చేస్తున్నారని, వీరి ద్వారా 9 ఆటోలు, 3 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో ఆటోలు, బైక్ దొంగల ముఠాలోని ఆటోనగర్ కు చెందిన షేఖ్ అలీ, అలీమ్, మహ్మద్ వాహిద్ లనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు.






