- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట స్థావరం పై దాడి.. 10 మంది అరెస్ట్
పేకాట స్థావరం దాడులు చేపట్టి.. 10 మందిని అదుపులోకి తీసుకున్న ఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, ఎల్లారెడ్డి : పేకాట స్థావరం దాడులు చేపట్టి.. 10 మందిని అదుపులోకి తీసుకున్న ఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై బొజ్జ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామ శివారులో శనివారం పేకాట ఆడుతున్న గ్యాంగ్ పై పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసున్నారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.3,240 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు అకస్మాత్తుగా దాడి చేసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు ప్రజలు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. ఇది గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు.






