పేకాట స్థావ‌రాల‌పై దాడులు.. 9 మంది అరెస్ట్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, తాడ్వాయి : పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపు తున్నారు. మండలంలోని సంతాయిపెట్, చిట్యాల గ్రామాల్లో ఎస్ఐ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో

పేకాట స్థావ‌రాల‌పై దాడులు.. 9 మంది అరెస్ట్..!
X

దిశ‌, తాడ్వాయి : పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలోని సంతాయిపెట్, చిట్యాల గ్రామాల్లో ఎస్ఐ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో మొత్తం తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సంతాయిపెట్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఒక రహస్య ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. చిట్యాల గ్రామంలో మరొక పేకాట స్థావరంపై దాడి చేసి, అక్కడి నుంచి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో అరెస్టయిన వారి వద్ద నుంచి రూ.18,910 మొత్తంలో నగదు,పేకాట ముక్కలు 6 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. అరెస్టయిన తొమ్మిది మంది యువకులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు, జూదం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ హెచ్చరించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story