మూడో విడతకు ఏర్పాట్లు పూర్తి

by Ajay Maddhiboyina |

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ఆర్మూర్ డివిజన్‌లో బుధవారం జరగనుంది. ఆలూర్, బాల్కొండ, భీమ్‌గల్, మెండోరా సహా 11 మండలాల పరిధిలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

మూడో విడతకు ఏర్పాట్లు పూర్తి
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ఆర్మూర్ డివిజన్‌లో బుధవారం జరగనుంది. ఆలూర్, బాల్కొండ, భీమ్‌గల్, మెండోరా సహా 11 మండలాల పరిధిలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. డివిజన్‌లో 146 సర్పంచ్ స్థానాలకు, 1130 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,06,795 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 38 రూట్లలో పోలింగ్ సిబ్బందిని తరలించనున్నారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం పూర్తయింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిపి, 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శాంతియుత పోలింగ్ కోసం భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

- దిశ ప్రతినిధి, నిజామాబాద్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ఆర్మూర్ డివిజన్‌లో బుధవారం జరగనుంది. డివిజన్‌లోని ఆలూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 146 సర్పంచ్ స్థానాలకు 562మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డివిజన్‌లో 19సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 1620 వార్డు స్థానాలకు గాను 490 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1130 వార్డు స్థానాలకు గాను 3382 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ నిర్వహణకు గాను 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డివిజన్ పరిధిలో 3,06,795మంది ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణకు 1490 మంది పీఓలు, 2278 ఓపీవోలు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపునకు 38 రూట్లను ఏర్పాటు చేశారు. 58 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది జోనల్ అధికారులు, 51 వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.

ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి...

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో సోమవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఏకగ్రీవం అయిన వాటిని మినహాయిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న మిగిలిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. ఈ ప్రక్రియలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నోడల్ అధికారి పవన్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story