- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడి.. ఏడుగురు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పరిధిలోని ఆలూరు బైపాస్ రోడ్డులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీసీఎస్ ఇన్ స్పెక్టర్ వి.రవికుమార్ తోపాటు సీసీఎస్ బృందం సిబ్బంది ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.

దిశ, అలూరు : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పరిధిలోని ఆలూరు బైపాస్ రోడ్డులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీసీఎస్ ఇన్ స్పెక్టర్ వి.రవికుమార్ తోపాటు సీసీఎస్ బృందం సిబ్బంది ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ముత్తుల ఆశోక్ రెడ్డి, లోక సూర్య ప్రకాష్ రెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, గడ్డం మల్లారెడ్డి, ఉట్నూర్ వెంకటేష్, మజ్జారి రామకృష్ణ, జక్రాన్ మండలం కొలిప్యాక గ్రామానికి చెందిన ఇట్టడి శ్రీనివాస్ రెడ్డి లు ఉన్నారు.
పేకాట రాయుళ్లు ఫోన్ పే ద్వారా కూడా ట్రాంజాక్షన్స్ చేస్తూ పేకాటాడుతున్నట్లు గుర్తించారు. రూ. 2.35 లక్షలు ఫోన్ పే ద్వారా ట్రాంజాక్షన్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేకాట స్థావరంలో రూ. 21,830 లు నగదు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న 7 మొబైల్ ఫోన్లను, నగదును ఆర్మూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సీపీ కార్యాలయం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.






