నేరాలు జరిగిన ప్రాంతాలను సర్కిల్ మ్యాప్‌లో నమోదు చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-15 14:35:15  IST  )

దిశ, కామారెడ్డి : నేరాలు జరిగిన ప్రాంతాలను సర్కిల్ మ్యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కామారెడ్డి రూరల్ సర్కిల్

నేరాలు జరిగిన ప్రాంతాలను సర్కిల్ మ్యాప్‌లో నమోదు చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
X

దిశ, కామారెడ్డి : నేరాలు జరిగిన ప్రాంతాలను సర్కిల్ మ్యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కామారెడ్డి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డు రూమును ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం బాధ్యత, సేవతో కూడినదని, ప్రతి అధికారి తన పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరాన్ని బట్టి టెక్నికల్ సపోర్ట్ వినియోగించుకోవాలని, సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లను తరచూ సందర్శించి కేసుల పురోగతిని సమీక్షిస్తూ ఎస్ హెచ్ వో లకు మార్గదర్శకాలు ఇవ్వాలని తెలిపారు. సర్కిల్ పరిధిలోని కేడి, సస్పెక్ట్, రౌడీ షీటర్ల కదలికలను క్రమం తప్పకుండా పరిశీలించి, వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాలు చోటుచేసుకునే ప్రాంతాలను క్రైమ్ హాట్ స్పాట్స్ గా గుర్తించి నిఘా బలపరచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు వంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాల నిరోధకతకు, అలాగే జరిగిన నేరాల ఛేదనకు సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. డయల్ 100 కాల్ అందిన వెంటనే సంఘటనా స్థలానికి తక్షణం చేరుకుని సమస్యను పరిష్కరించేలా పోలీస్ స్టేషన్ సిబ్బంది స్పందన వేగాన్ని పెంచాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ వాహనాలు 24x7 గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సీఐ రామన్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story