- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓట్లిచ్చినం.. సీట్లిచ్చినం..మా వాటా పదవులు మాకివ్వాల్సిందే

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బలంగా నిర్మాణం చేశామని, అన్ని ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ఓట్లిచ్చాం.. సీట్లిచ్చాం.. పార్టీ పదవుల్లో రాష్ట్ర కమిటీలో మా వాటా పదవులు మాకు కావాల్సిందేనని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వేదిక మీదే ఏకంగా బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్ రావును కోరారు. సోమవారం నిజామాబాద్ లోని శ్రీరామా గార్డెన్ లో జరిగిన నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి సభ్యుల సమ్మేళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. ఇందూరు ప్రాంతంలో బీజేపీ ఎక్కడ బలంగా ఉందని కల్వకుంట్ల కవిత వెటకారంగా ప్రశ్నిస్తే.... 45 నుండి 48 శాతం ఓట్ల శాతం సాధించి సత్తా చూపామన్నారు. నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 కార్పొరేటర్లను బీజేపీ గెలిస్తే, కేవలం 13 మాత్రమే టీఆర్ఎస్ గెలిచిందన్నారు. అప్పుడు కూడా బీజేపీ బలాన్ని బీఆర్ఎస్ కు గట్టిగానే చూపామని అర్వింద్ అన్నారు. బీజేపీ ఓట్ల శాతం 50 శాతం మార్క్ ను దాటించాలన్నది తన లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 48 శాతం వరకు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర పార్టీ యూనిట్ లో మా జిల్లా కార్యకర్తలకు సరైన న్యాయం జరగాలన్నదే నాకు ముఖ్యమని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ ఎదుట అర్వింద్ ధర్మపురి కుండ బద్దలు కొట్టారు.
అర్వింద్ కు పొగరుందంటారు.. అవును.. నాకు పొగరే..
నేను మోదీ భక్తుడిని. కాషాయం పూసుకుని తిరుగుతున్నా.. బీజేపీ జెండా ఎగురుతూనే ఉండాలని, అధికారంలోకి తేవాలనే కాంక్షతో కసితో పనిచేసే నిఖార్సైన బీజేపీ ని కార్యకర్తను, మోదీకి పరమ భక్తుడినని అర్వింద్ చెప్పుకొచ్చారు. నాకు కులముంది.. ధనముంది.. పర్సనాలిటీ ఉంది.. అన్నింటికీ మించి బీజేపీని అధికారంలోకి తేవాలనే కసి ఉందన్నారు. బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీని ఎదగకుండా చేసేవారంటే నాకు గిట్టదు. అందుకే నాకు పొగరు.. ఆ పొగరే నా నిజాయితీ.. అదే నాకు అలంకారమని అర్వింద్ అన్నారు.






