- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీసీ అధ్యక్షుడి కోసం ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు : ఎం.పీ. రాజ్ పాల్ ఖరోలా
దిశ, బాన్సువాడ : డీసీసీ అధ్యక్షుడి కోసం ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎం.పీ. రాజ్ పాల్ ఖరోలా సూచించారు. బాన్సువాడలో కామారెడ్డి కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుని ఎంపికలో భాగంగా ఏర్పాటు చేసిన సంఘటన్

దిశ, బాన్సువాడ : డీసీసీ అధ్యక్షుడి కోసం ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎం.పీ. రాజ్ పాల్ ఖరోలా సూచించారు. బాన్సువాడలో కామారెడ్డి కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుని ఎంపికలో భాగంగా ఏర్పాటు చేసిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎం.పీ. రాజ్ పాల్ ఖరోలా మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక విధానాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు తనను నియమించారని.. ఐదేళ్లు కాంగ్రెస్ లో క్రీయాశీలకంగా ఉన్న వారు ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులైన వారిని త్వరలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్ది, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డిసిసిబి మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి,పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి,సీనియర్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, అజీమ్, నార్ల సురేష్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.






