ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

by Naveena |

బెట్టింగ్ మోసాలకు అంతే లేకుండా పోతోంది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఏప్రిల్ 02:బెట్టింగ్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూరులో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ మోసానికి బలయ్యాడు. పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ బెట్టింగ్ కు అలవాటు పడ్డ ఆకాష్ దాదాపు రూ. 5 లక్షలకు పైగా బెట్టింగ్ లో పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆకాశ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story