- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ నగరంలో రెచ్చిపోయిన దొంగలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. నగరంలో శనివారం

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. నగరంలో శనివారం తెల్లవారుజామున రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. చోరీకి గురైన ఏటీఎంలను అక్కడి ప్రాంతాన్ని ఇంచార్జి సీపీ, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. శనివారం తెల్లవారుజామున నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్రా బ్రాంచ్ కు సంబంధించిన క్రెడిట్ బ్యాంక్ ఏటీఎం తో పాటు, ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద నున్నన ఎస్ బి ఐ బ్యాంక్ ఏటీఎం లలో గుర్తు తెలియని దొంగలు దాడి చేసి అందులో ఉన్న దాదాపు రూ. 30 లక్షల నగదును దొంగలు దోచుకుని వెళ్లారు. ఏటీఎం లలోని నగదు చోరీ చోరీ చేసే క్రమంలో గ్యాస్ కట్టర్ లతో ఏటీఎం లను కట్ చేసి నగదును చోరీ చేసే ప్రయత్నం చేశారు. గ్యాస్ కట్టర్ తో కట్ చేసే క్రమంలో మిషన్లు పూర్తిగా కాలి పోయాయి. ఈ రెండు ఘటనా స్థలాలను నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్, కామారెడ్డి ఎస్ పీ రాజేష్ చంద్ర స్వయంగా సందర్శించారు. అక్కడి పరిసరాలను, పరిస్థితులను ఆయన పరిశీలించారు. సంఘటన స్థలాలను క్షుణ్ణంగా పర్యేవేక్షించిన పోలీస్ బాస్ సంఘటన స్థలాలను పరిశీలించారు. ఏటీఎం ల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, చోరీ జరిగిన విధానం, ఏటీఎం ల లోనికి, బయటకు వెళ్లే మార్గాలను అధ్యయనం చేశారు.
ఐదు స్సెషల్ టీం లు ఏర్పాటు..
ఒకే రోజు నగరంలో రెండు ఏటీఎం లలో చోరీ ఘటనలు చోటు చేసుకోవడం, రూ. 30 లక్షల వరకు నగదు చోరీ జరగడంతో ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏటీఎం చోరులను పట్టుకునేందుకు పక్కా వ్యూహంతో పోలీసులు ముందుకెళుతున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఐదు స్సెషల్ టీం లు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లను సేకరించి, ఏటీఎం లోపలి, బయట పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు. కేసు విచారణలో క్లూస్ టీం, సాంకేతిక నిపుణలు, స్థానిక పోలీస్ బృందాలతో పాటు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.
పెట్రోలింగ్ పెంపు..
రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపైన, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ ను పెంచినట్లు పోలీసు అధికారులు చెపుతున్నారు.
నిఘాను కట్టుదిట్టం చేసిన పోలీసులు..
ఇతర ప్రాంతాల నుండి జిల్లాలోని ప్రవేశించే ప్రవేశ మార్గాలు, జిల్లా నుండి బయటకు వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏటీఎం ల భద్రతను బలోపేతం చేసేందుకు బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకుని అలారం వ్యవస్థలు, అదనపు సీసీ టీవీలు, లైటింగ్ వ్యవస్థ మెరుగుదలపై ఇంచార్జి సీపీ రాజేశ్ చంద్ర పలు సూచనలు చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలకు ఇంజార్జి సీపీ భరోసా కల్పించారు. నిందితుల గుర్తింపు, పట్టుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో నగరంలో భద్రత మరింత బలోపేతం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తునదని తెలియజేసారు. నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) గట్టు బస్వారెడ్డి , నిజామాబాదు ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఫోర్త్ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ కుమార్ , టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఫోర్త్ టౌన్ ఎస్ఐ గంగాధర్ మరియు బ్యాంక్ మేనేజర్ శివకుమార్ పాల్గొన్నారు.






