- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనులన్నీ సకాలంతో పూర్తి కావాలి.. నాణ్యత లోపించొద్దు : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త శనివారం తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త శనివారం తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న పలు కీలక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అమృత్ - 2 పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మ్యాన్ హోల్‌స్ పనులను నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ అధికారులను ఆదేశించారు. వాటర్ వర్క్స్, వాటర్ ట్యాంకుల పనులు, నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేసి వాటి ద్వారా అందే సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. టీయూఎఫ్ఐడీసీ ఫండ్ రూ. 60 కోట్లు కింద ప్రతి డివిజన్ కు రూ. కోటి చొప్పున అభివృద్ధి , మరమ్మతు పనుల కోసం టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, కల్వర్ట్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా అవసరాలను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని హెచ్చరించారు. ఇందూరు నగర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ఆశయంగా ముందుకు సాగుతున్నామని, మా ఈ ప్రయత్నంలో కాంట్రాక్టర్లు, అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ కోరారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఇన్ చార్జి మున్సిపల్ ఈఈ నాగేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.






