- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆర్మూర్ ప్రజాపాలనలో రసాభాస
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా మంగళవారం నూతన చెత్తబండిని ప్రారంభించారు. కానీ దాని అద్దాలను కౌన్సిలర్ ధ్వంసం చేశాడు. వివరాల్లోకి వెళితే గత 12 నెలల నుండి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36వ వార్డుకు చెత్త బండి రావడం లేదని పలుమార్లు వార్డు ప్రజలందరూ ఆ వార్డు కౌన్సిలర్ డార్లింగ్ రమేష్ తో కలిసి మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో ఆ వార్డు ప్రజలు చాలా ఇబ్బందులకు లోనయ్యారు.
దాంతో కౌన్సిలర్ డార్లింగ్ రమేష్ కూడా మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజుకు చాలాసార్లు విన్నవించాడు. విషజ్వరాలు ప్రబలుతున్నాయని చెప్పినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. మరో పక్క రెండు నెలల కింద చెత్త సేకరణ చేసేందుకు కొత్త బండి వచ్చినా దానిని మున్సిపాలిటీలోనే ఉంచి ఆ వార్డుకు పంపించలేదు. దాంతో ఆ నూతన చెత్తబండి అద్దాలను ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ధ్వంసం చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది.
- Tags
- Alchemy