- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల సేవే లయన్స్ క్లబ్ లక్ష్యం : గవర్నర్ అమర్నాథ్ రావు
దిశ, ఏర్గట్ల : పేదల సేవే లయన్స్ క్లబ్ లక్ష్యమని గవర్నర్ అమర్నాథ్ రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ నూతన శాఖను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

దిశ, ఏర్గట్ల : పేదల సేవే లయన్స్ క్లబ్ లక్ష్యమని గవర్నర్ అమర్నాథ్ రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ నూతన శాఖను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సమాజ సేవలో అగ్రగామి సంస్థగా నిలుస్తోందని, పేద ప్రజలకు సహాయం అందించడం, విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం, ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తోందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ఏర్గట్ల లయన్స్ క్లబ్ సభ్యులు కూడా అదే దిశగా ముందుకు సాగి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. క్లబ్ విధివిధానాలు, కార్యాచరణ, సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో సభ్యులకు వివరించారు. “సేవను మనసుతో చేసే ప్రతి ప్రయత్నం సమాజానికి వెలుగునిస్తుంది” అని గవర్నర్ అమర్నాథ్ అన్నారు. కార్యక్రమంలో సుదీర్ బాబు, రాజన్న, సూర్యనారాయణ, మోర్తాడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పబ్బ సంజీవ్, గోపిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శిగా సనుగుల చిరంజీవి, క్యాషియర్‌గా శ్రీరాముల శ్రీనివాస్, సభ్యులుగా గుల్లె రాజేశ్వర్, ఏనుగంటి వెంకటేష్, జక్కని శ్రీధర్, రంగు వెంకట్ గౌడ్, సనుగుల రమేష్, శ్రీరాముల రత్నయ్య లు నియమితులయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ రావు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.






