తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం

by Taduka Kalyani |

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు కమ్మర్‌పల్లి హెచ్‌ఎం, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పసుపుల సాయన్న గురువారం తెలిపారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం
X

దిశ, కమ్మర్‌పల్లి: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు కమ్మర్‌పల్లి హెచ్‌ఎం, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పసుపుల సాయన్న గురువారం తెలిపారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు, ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలనుకునే వారు, గృహిణులు, యువత, వృద్ధులు తదితరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దూర విద్యా విధానంలో నిర్వహించే ఈ కోర్సులకు గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపారు. పదో తరగతి ప్రవేశానికి టీసీ లేదా రికార్డు షీట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ప్రవేశానికి పదో తరగతి మెమో, టీసీ, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో పాటు అన్ని పత్రాలకు రెండు జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా జతచేయాలని వివరించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పసుపుల సాయన్న కోరారు.

Next Story