పోక్సో కేసులో నిందితుడి రిమాండ్

by Ratna Kumari |

దిశ, నాగిరెడ్డిపేట్ : పోక్స్ కేసులో మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని

పోక్సో కేసులో నిందితుడి రిమాండ్
X

దిశ, నాగిరెడ్డిపేట్ : పోక్సో కేసులో మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వివాహిత వ్యక్తి మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి బాలికను 4 నెలల క్రితం లోబరుచుకొని పలుమార్లు లైంగిక దాడి జరిపినట్లు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితుడు పరారీలో ఉండగా శనివారం ఎల్లారెడ్డి పట్టణంలో పట్టుకొని బాన్సువాడ డీఎస్పీ విఠ‌ల్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Next Story