పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : పోక్సో కేసులో ఓ నిందితునికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బిచ్కుంద మండలంలోని ఓ గ్రామంలో 2022 సెప్టెంబర్ 18న

పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష
X

దిశ, కామారెడ్డి : పోక్సో కేసులో ఓ నిందితునికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బిచ్కుంద మండలంలోని ఓ గ్రామంలో 2022 సెప్టెంబర్ 18న స్కూల్‌కు సెలవు ఉండగా బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అదే మండలంలోని ఫత్లాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు యగు జల్దేవార్ శ్రీనివాస్ “ఇటు రా” అంటూ పిలిచి బాలికను అతని ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక భయపడి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న నానమ్మ వచ్చి తలపులు గట్టిగా కొట్టగా, నిందితుడు బాధితురాలిని బెదిరిస్తూ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని పారిపోయాడు. తరువాత సాయంత్రం తల్లిదండ్రులు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చినప్పుడు బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. 2022 సెప్టెంబర్ 19న బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పరిశోధనలో భాగంగా కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విచారించి జల్దేవార్ శ్రీనివాస్ ను నేరస్తునిగా గుర్తించి ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసులో సాక్షులను విచారించి, సరైన సాక్ష్యాలను సేకరించి నేరస్తుడి పై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయడం జరిగిందన్నారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వర ప్రసాద్ నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ₹30,000/- జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు.

Next Story