మ‌హిళా హ‌త్య కేసు నిందితుల అరెస్ట్

by Ratna Kumari |

దిశ, నవీపేట్ : మండలం లోని ఫతేనగర్ శివారు బాసర ప్రధాన రహదారి సమీపంలో కెనాల్ పక్కన గత నెల 24 న మండలంలోని మద్దెపల్లి కి చెందిన శ్యామల లక్ష్మిని హత్య చేసి నిప్పంటించిన నిందితులను నవీపేట్ పోలీసులు

మ‌హిళా హ‌త్య కేసు నిందితుల అరెస్ట్
X

దిశ, నవీపేట్ : మండలం లోని ఫతేనగర్ శివారు బాసర ప్రధాన రహదారి సమీపంలో కెనాల్ పక్కన గత నెల 24 న మండలంలోని మద్దెపల్లి కి చెందిన శ్యామల లక్ష్మిని హత్య చేసి నిప్పంటించిన నిందితులను నవీపేట్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్దెపల్లి కి చెందిన శ్యామల లక్ష్మీ కు అదే గ్రామానికి చెందిన బాదావత్ పద్మ, ఫకీరాబాద్ కు చెందిన గొల్ల సంగీత,మంగలి బాబు తో సన్నిహిత సంబంధాలు ఉండేవని, వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి, కలిసి పనులు చేసేవారని తెలిపారు. కొద్దీ కాలం నుండి డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండటంతో శ్యామల లక్ష్మీ ని చంపాలని పథకం ప్రకారం కల్లు తాగుదామని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం మత్తులో ఉన్న లక్ష్మి ని సంగీత మిగతా ఇద్దరి సహాయం తో గొంతు నమిలి చంపివేసి అనంతరం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ తో కాల్చి అక్కడి నుండి వెళ్లిపోయారని తెలిపారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకున్న నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్, రాజశేఖర్, ఎఎస్సై గఫర్, కానిస్టేబుల్ రాజశేఖర్, నవీపేట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Next Story