- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చోరీ కేసులో నేరస్తుడు అరెస్ట్
by Taduka Kalyani |
నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ కు చెందిన రియాజ్ ఖాన్ అనే చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ జూన్ 18: నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ కు చెందిన రియాజ్ ఖాన్ అనే చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన రియాజ్ ఖాన్ జల్సాల కోసం డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయడానికి బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో ఆజ్మీర్ బేగం ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని బీరువాలు పగల గొట్టి అందులోని రూ. 1.20 లక్షల నగదు, 6 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి పట్టగొలుసులు దొంగిలించుకుని వెళ్లాడు. గురువారం నిందితుడిని ఖిల్లా చౌరస్తా దగ్గర పట్టుకొని రూ. 1.10 లక్షల నగదు, ఒక ఇనుప సుత్తి జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రియాజ్ ఖాన్ పై నగరంలోని వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లలో ఒక్కో దొంగతనం కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు.
Next Story






