హ‌త్య కేసులో నిందితులు అరెస్ట్..!

by Ratna Kumari |

దిశ‌, బాన్సువాడ : హ‌త్య కేసులో నిందుతులు అరెస్ట్ అయిన ఘ‌ట‌న బిచ్ కొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మ‌హారాష్ట్ర నాందేడ్ జిల్లా కి

హ‌త్య కేసులో నిందితులు అరెస్ట్..!
X

దిశ‌, బాన్సువాడ : హ‌త్య కేసులో నిందుతులు అరెస్ట్ అయిన ఘ‌ట‌న బిచ్ కొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మ‌హారాష్ట్ర నాందేడ్ జిల్లా కి చెందిన సునీత తెలంగాణ‌లోని బిచ్కుంద మండ‌లం ఎల్లారం తండాకు చెందిన చౌహ‌న్ ప్ర‌హ్ల‌ద్ తో 18 సంవ‌త్స‌రాల కింద‌ట పెళ్లి జ‌రిగింది. సునీతకి సంతానం లేక పోవడంతో నీర్ష తండాకు చెందిన రాహుబాయిని రెండో భార్యగా ప్రహ్లాద్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం కలగా, సునీతకు పిల్లలు లేరని తరచూ గొడవపడేవారు. 15 రోజుల క్రితం ఇలాగే గొడవ జరగడంతో సునీత పుట్టింటికి వెళ్ళింది. తల్లి దండ్రులు దీపావళి పండగ తర్వాత పెద్దల సమక్షంలో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తండ్రి రాథోడ్ కాంతి రావు భర్త వద్దకు పంపాడు.


ఈనెల 20 సునీతా పురుగుల మందు తాగి చనిపోయింది అని తెలిసిన‌ వాళ్ళు ఎల్లారం తాండ వచ్చి చూడగా శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం కలిగి కాంతి రావు కూతురు మృతి పై అనుమానం ఉందని బిచ్కుంద పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై మోహ‌న్ రెడ్డి అనుమానస్ప‌ద కేసు నమోదు చేశారు. డీఎస్పీ జ‌గ‌న్నాథ్ రెడ్డి పర్యవేక్షణలో సి.ఐ. రవికుమార్ నేతృత్వంలో అనుమానితులైన ప్రహ్లాద్, రాహు బాయి లను విచారించగా.. సునీత మద్యానికి బానిసాయి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ తమ కుటుంబం పరువు తీస్తుందని,ఆమెను చంపివేయాలని ప్రహ్లాద్ అతని రెండో భార్య రాహు బాయి లు నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం... ఈ నెల20వ తేదీ రాత్రి కాళ్లు చేతులు ఆడకుండా ప్రహ్లాద్ గట్టిగా పట్టుకుని ఆమె నోట్లో ముందుగా తెచ్చుకున్న పురుగుల మందును పోయగా అతని రెండో భార్య సునీత ముఖం మీద దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారని విచారణలో ఒప్పుకోవడం తో నిదితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో కేసు చేదించిన సిబ్బందిని జిల్లా ఎస్.పి. అభినందించారని డీఎస్పీ తెలిపారు.

Next Story