అంతా చేసింది ఆ ఒక్కడే..

by Disha Web Desk 20 |
అంతా చేసింది ఆ ఒక్కడే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన పత్తి లక్ష్మీ మర్డర్ కేసును పోలీసులు చేదించడంలో సక్సెస్ అయ్యారు. కానీ అదే కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకోవడంతో ఇది వరకు చేసిన మరో మూడు మర్డర్ కేసులు కొలిక్కి వచ్చినట్లు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు తెలిపారు. సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో కె.ఆర్.నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఆగస్టు 24న నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన పత్తి లక్ష్మీ మాక్లూర్ మండలం కొత్తపల్లిలోని తన బిడ్డ ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని కొడుకు శివకుమార్ మాక్లూర్ పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. అదే రోజు ఆటోలో మాక్లూర్ లో బయలుదేరిన తల్లి రోజులు గడిచిన రాలేదని ఫిర్యాదు చేయడంతో మాక్లూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి రోడ్డు వెంట ఉన్న సీపీ కెమెరాలను పరిశీలించారు.

రెండరోజులకు మాక్లూర్ మండలం ఢీకంపల్లి అటవి ప్రాంతంలో పత్తి లక్ష్మీ డెడ్ బాడిని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, నార్త్ రూరల్ సీఐ నరహరి, ఎస్సై యాదగిరిగౌడ్, రాజేశ్వర్ గౌడ్ లు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారాం బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన అల్లెపు మల్లయ్య, అతని అల్లుడు కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మగేని పోశెట్టిలపై అనుమానంతో విచారణ జరుపుతున్నారు.

సోమవారం ఆర్మూర్ పట్టణంలోని దత్తాత్రేయ బంగారం దుకాణం వద్ద అల్లెపు మల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది. ఆగస్టు 24న పత్తి లక్ష్మీ మాక్లూర్ మండలం కొత్తపల్లి రోడ్డులో నందిపేట్ వైపు వెళ్లే ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఆటో డ్రైవర్ మగెని పోశెట్టి అతని మామ అల్లెపు మల్లయ్యలు పత్తి లక్ష్మీని ఆటోలో ఎక్కించుకుని తీసుకుపోయారు. తాము నిజామాబాద్ వెళ్తున్నామని అబద్దం చెప్పి ఢీకంపల్లి అటవి ప్రాంతంలో ఆటోలోనే పత్తి లక్ష్మి తలపై దాడి చేశారు.

ఆటో నుంచి ఆమెను లాగి కింద పారేశారు. అప్పటికి ఆమె ప్రాణంతో ఉందని మరోసారి కర్రతో కొట్టడంతో లక్ష్మి అక్కడికక్కడే చనిపోయిది. ఆమె మెడలోని బంగారు గొలుసు, ఉంగరం, చెవి కమ్మలు, మాటిలు చోరి చేసి పారిపోయారు. మల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఒంటరి మహిళలే లక్ష్యంగా వారిపై దాడి చేసి బంగారం దోచుకోవడం లక్ష్యంగా ముగ్గురిని మట్టుబెట్టినట్లు సీపీ తెలిపారు. 2019లో జక్రాన్ పల్లి మండలం అర్గుల్ శివారులో మహిళను మల్లయ్య పలానా వ్యక్తి ఎక్కడ ఉంటాడని ఆరా తీసి ఆమెపై ప్లాస్టిక్ పైప్ తో దాడి చేసి ఆమె కింద పడగానే బంగారు పుస్తెలతాడును తీసుకుని పారిపోయాడు.

ఆ తర్వాత తన చిన్న కొడుకు పెండ్లి చేయాలని నిర్ణయించి 2020 జనవరిలో పెర్కిట్ లో బాలాజి హార్డ్ వేర్ నుంచి పారా కామ(కర్ర) కొనుగోలు చేశాడు. ముప్కాల్ మండలం నల్లురి గ్రామ శివారులో బొమ్మలాదేవాయి(55) ఒంటరిగా పొలం పని చేస్తుండగా మోటార్ సైకిల్ పై అక్కడికి వెళ్లిన మల్లయ్య కొత్తపల్లి రాజయ్య అడ్రస్ ను అడిగి ఆమె ఏమరపాటుగా ఉండడాన్ని గమనించి పార కర్రతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే దేవాయి చనిపోయింది. ఆమె మెడలోనిపుస్తెల తాడు, బంగారు చైన్ ను దొంగిలించి పరారీ అయ్యాడు.

ఇటీవల అల్లుడు పోశెట్టి యాక్సిడెంట్ చేసినందుకు రూ.50 వేలు కావాలని మామను కోరడంతో జులై 16న నగరంలోని ఇంద్రాపూర్ కాలనీలోని ప్రధాన రోడ్డుపై కిరాణా షాప్ కు వెళ్లి ఒంటరిగా కిరాణా సరుకులు అమ్ముతున్న మహిళ వద్ద సిగరేట్ ప్యాకెట్ కొని బిస్కెట్ ప్యాకెట్ కోసం అడుగగా ఆమె దానిని తీసిస్తుండగా వెనుక నుంచి కర్రతో బాది బంగారు గొలుసును తెంపుకుని పరారీ అయ్యాడు. ఆ సమయంలో ఒక ముసలి వ్యక్తి ఈ విషయాన్ని చూసి అక్కడికి రాగా మల్లయ్య బైక్ పై పరారీ అయ్యాడు.

మల్లయ్య గతంలో కామారెడ్డి, రాజన్న సిరిసిల్లా, సిద్దిపేట్ జిల్లాలో వివిధ కేసులకు సంబంధించి నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని, బెయిల్ పై నుంచి కోర్టుకు హాజరుకాకపోవడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని సీపీ తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మల్లయ్యను పట్టుకోవడంతో కేసులు కొలిచ్చి వచ్చాయని, అతని అల్లుడు పోశెట్టి పరారీలో ఉన్నాడని సీపీ తెలిపారు.

నాలుగు జిల్లాల పరిధిలో 11 కేసులు నమోదయ్యాయని అందులో ఇప్పటి వరకు 15 తులాల బంగారు ఆభరణాలను చోరి చేశాడని సీపీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్, సీసీ ఎస్ సిఐ రాజశేఖర్ నార్త్ రూరల్ సిఐ నరహరి, ఎస్సై యాదగిరిగౌడ్, రాజేశ్వర్ గౌడ్ లు ఉన్నారు.


Next Story

Most Viewed