నాగిరెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు.

నాగిరెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన భూమి సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. రెవెన్యూ అధికారులు ఆ వ్యక్తి వద్ద నుంచి భారీగా లంచం డిమాండ్ చేయడంతో, విసుగెత్తిన వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో దాడులు జరిపి రెవెన్యూ అధికారులను విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story