- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవలి కాలంలో పెరిగిపోయినఅవినీతి కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై కూడా అవినీతి ఆరోపణలుండటంతో నిజామాబాద్ ఏసీబీ డీ ఎస్ పీ శేఖర్ గౌడ్ ఆదేశాల మేరకు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో భయంతో డాక్యుమెంట్ రైటర్లు మూకుమ్మడిగా వారి దుకాణాలను మూసివేసి అక్కడి నుంచి పరారయ్యారు.
Next Story






