- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..
నిజామాబాద్ రవాణాశాఖ (ఆర్టీ ఏ) కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ, డీఎస్పీ శేఖర్ గౌడ నేతృత్వంలో సిబ్బంది కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రవాణాశాఖ (ఆర్టీ ఏ) కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ, డీఎస్పీ శేఖర్ గౌడ నేతృత్వంలో సిబ్బంది కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి పరాకాష్టకు చేరిందని ఇటీవల కార్యాలయ ఉద్యోగులు, అధికారులపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కార్యాలయంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. దీంతో బుధవారం ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్, అనిశా సిబ్బంది కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్, వెహికిల్ ఫిట్ నెస్, లైసెన్స్ రెన్యూవల్, వెహికిల్ లైప్ టైమ్ ఎక్స్ టెన్షన్ ఇలా ఏ పనికైనా మధ్యవర్తుల ద్వారానే పనులు జరగడంతో.. జిల్లా రవాణాశాఖ అవినీతికి బ్రాండ్ అడ్డాగా మారిందనే విమర్శలు ఎక్కువయ్యాయి.
ఉన్నతాధికారుల నుంచి పలు మార్లు హెచ్చరికలు వచ్చినా అధికారులు, సిబ్బందిలో మార్పు రావడం లేదని కార్యాలయంలోని కింది స్థాయి సిబ్బందే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ముడుపులు ముట్టనిదే ఏ స్థాయిలో ఇక్కడి పని జరగదని కార్యాలయ సిబ్బందే ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే కార్యాలయంలో అవినీతి ఏ మేరకు తిష్ట వేసిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఏసీబీ అధికారులు కొంత కాలంగా ఈ శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో.. ఒక్కసారిగా రవాణాశాఖలో కలకలం మొదలైంది. అవినీతి అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సోదాల వివరాలు తెలియాల్సి ఉంది.






