- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు
by Batti.Sumithra |
చేపల వేటకు వెళ్లి మంజీరా నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

X
దిశ, బిచ్కుంద : చేపల వేటకు వెళ్లి మంజీరా నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలం, ఖత్గవ్ గ్రామానికి చెందిన ఉష్కళ్వార్ రాజు, అతని అన్న నరసింహులు చేపల వేటకు వెళ్లారు. ఓ వైపు నరసింహులు చేపలవేట కొనసాగిస్తున్న సమయంలో గడ్డపై నిల్చున్న రాజు అనుకోకుండా నీటిలోకి దిగాడు.
ప్రవాహం ఎక్కువగా ఉండటంలో రాజు నీటిలో గల్లంతయినట్లు అతని అన్న నరసింహులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Next Story






