- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ఎక్కబోయి జారిపడ్డ యువకుడు.. తీవ్ర గాయాలు
by Ratna Kumari |
కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ యువకుడు జారి కింద పడటంతో రెండు కాళ్లు కోల్పోయిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, కామారెడ్డి : కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ యువకుడు జారి కింద పడటంతో రెండు కాళ్లు కోల్పోయిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కామారెడ్డి రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడి పడడంతో మహారాష్ట్రలోని ఉమ్రి జిల్లాకు చెందిన అనిల్ అనే యువకుడి రెండు కాళ్లు తెగిపోయాయి. యువకుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతను కామారెడ్డి జీజీ హెచ్ లో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






