- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ యువకుని మృతి
by Ratna Kumari |
దిశ, భిక్కనూరు : చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, భిక్కనూరు : చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన జెగ్గన్న గారి ఆకాష్ రెడ్డి(31) గత కొంతకాలంగా తాగుడుకు బానిస అయ్యాడు. పనికి వెళ్లలేక చేతిలో డబ్బులు లేక తల్లి భార్యలతో గొడవ పడుతుండేవాడు. అయితే ముందు రోజు సాయంత్రం సిద్ధ రామేశ్వర నగర్ సమీపంలో పాయిజన్ తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా దగ్గర వాళ్లకు తెలపడంతో, వెంటనే అదే రోజు రాత్రి కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని బావ కుంట హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్ఐ డి.ఆంజనేయులు తెలిపారు
Next Story






