గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని యువ‌కుడు మృతి

by Ratna Kumari |

దిశ‌, రాజంపేట : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి శివాయిపల్లి గ్రామ శివారు లో చోటుచేసుకుంది. రాజంపేట ఎస్సై రాజు తెలిపిన

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని యువ‌కుడు మృతి
X

దిశ‌, రాజంపేట : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి శివాయిపల్లి గ్రామ శివారు లో చోటుచేసుకుంది. రాజంపేట ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శివాయిపల్లి గ్రామానికి చెందిన గజ్జల నరేష్(28) శుక్రవారం రాత్రి శివాయిపల్లి నుంచి కామారెడ్డికి వెళ్తుండ‌గా.. శివాయిపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృత్యుని తల్లి గజ్జల నరసవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై రాజు తెలిపారు.

Next Story