- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచినీటి బావిలో అడవి పంది తల, పేగులు లభ్యం
బక్రీద్ పండుగ రోజు లింగంపేట మండల కేంద్రంలో మంచినీళ్ల బావిలో అడవి పంది తల పేగులు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, లింగంపేట : బక్రీద్ పండుగ రోజు లింగంపేట మండల కేంద్రంలో మంచినీళ్ల బావిలో అడవి పంది తల పేగులు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. మండల కేంద్రంలో ఏం జరుగుతుం దోనని ప్రజలు తీవ్ర ఆందోళ న చెందుతున్నారు. లింగంపేటలోని పాత పోలీసు స్టేషన్ సమీపం లోని హనుమాన్ మందిరం వద్ద గల మంచినీళ్ళ బావిలో అడవి పంది తలకాయ పేగులను సంచుల్లో మూటగట్టి బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేశారు. హనుమాన్ మందిరం చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ప్రజలు ప్రతిరోజు బావి నీటిని మోటార్ల సాయంతో వినియోగిస్తున్నారు. బావి పక్కనే ఎక్కువగా బ్రాహ్మణుల ఇళ్లు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే అడవి పంది సంచులు మూటగట్టి పడేసి ఉంటారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై దీపక్ కుమార్ బావి వద్దకు చేరుకొని సంచిని బయ టకు తీసి చూడగా అందులో అడవి పంది తలకాయ, పేగులు ఉన్నట్లు గుర్తించారు.
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట మంచినీళ్ళ బావిలో పడేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బావి నీటిని మోటార్ల సాయంతో బయటకు తీసి శుద్ధి చేయించారు. ఈ సంఘటన లింగంపేట మండలంలో చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ప్రత్యేక బల గాలతో మోహరించారు. ఈ విషయమై ఎస్సై దీపక్ కుమార్ ను వివరణ కోరగా.. మంచినీళ్ల బావిలో అడవిపంది తలకాయ పేగులను వేసిన మాట వాస్తవమేనని అన్నారు. బావిలో అడవి పంది తలకాయ, పేగులను ఎవరు వేశారు అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. బావి చుట్టు పక్కల మజీద్, బ్రాహ్మణుల, వైశ్యుల, ముదిరాజ్, పద్మశాలిలు ఎక్కువగా నివాసంఉండే ప్రాంతంలో ఘటన జరగడం విశేషం. బక్రీద్ పండగ రోజునే ఈ ఘటన జరగడంతో లింగంపేటలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోతుగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు
లింగంపేట మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం వద్ద గల మంచినీళ్ల బావిలో గుర్తు తెలియని వ్యక్తులు అడవి పంది తలకాయ, పేగులను సంచిలో మూటగట్టి పడేసిన ఘటన పై బీజేపీ నాయకుడు పెద్ది శివయ్య ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.






