పోలీసు వృత్తి కి నిలువెత్తు నిదర్శనం.. తోట లింగం

by Ratna Kumari |

పోలీసు వృత్తికి నిలువెత్తు నిదర్శనం ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సీఐ తోట లింగం.. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తోట లింగం హైదరాబాద్ రేంజ్ నిరోధక శాఖ విభాగంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

పోలీసు వృత్తి కి నిలువెత్తు నిదర్శనం.. తోట లింగం
X

దిశ , నాగిరెడ్డిపేట్ : ( ఎల్లారెడ్డి) : పోలీసు వృత్తికి నిలువెత్తు నిదర్శనం ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సీఐ తోట లింగం.. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తోట లింగం హైదరాబాద్ రేంజ్ నిరోధక శాఖ విభాగంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తోట లింగం చేసిన ఉత్తమ సేవలకు గాను ప్రతిష్టాత్మక పోలీసు సేవా పతకానికి ఎంపికయ్యాడు. శనివారం హైదరాబాద్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం తోట లింగం అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ రేంజ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ 2025లో పోలీసు విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. తోట లింగం 2009 బ్యాచ్ ఎస్సైగా హైదరాబాద్ లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం కంచన్ బాగ్, తిరుమలగిరి , పోలీస్ స్టేషన్లలో నిక్కచ్చిగా పనిచేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. పదోన్నతుల్లో భాగంగా సీఐడీ లో సీఐగా టాస్క్ ఫోర్స్ లో పనిచేశారు. అనంతరం హైదరాబాద్ రేంజ్ లోని అవినీతి నిరోధక శాఖలో సర్కిల్ ఇన్స్ ఫెక్టర్ గా గత ఏడాది నుంచి పనిచేస్తూ ఉత్తమ సేవలకు గాను సేవా పతకానికి ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఎలాంటి వివాదాల్లేకుండా విధులు నిర్వహిస్తూ, ఉత్తమ సేవా పతకానికి ఎంపికవ్వడంపై ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story