- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం నాగిరెడ్డిపేట్ మండలం మాసంపల్లి గండి దగ్గర జరిగింది. పొలంలో రక్తపు మడుగులో పడివున్న బాలుడి మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించి స్థానిక పోలీసులకు సమచారమందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. బాలుడిని కిడ్నాప్ చేసి హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల పోలీస్ స్టేషన్‌లలో తప్పిపోయినా లేదా కనిపించకుండా పోయిన కేసుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. పదేళ్ల బాలుడిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






