ఇందిరమ్మ ఇంటి బిల్లులు రాక ఫ్లెక్సీ కట్టి ఒంట‌రి నిరుపేద మహిళ నిరసన

by Ratna Kumari |

ఇందిరమ్మ ఇంటి బిల్లులు రాక ఫ్లెక్సీ కట్టి  ఒంట‌రి నిరుపేద మహిళ నిరసన
X

దిశ , నాగిరెడ్డిపేట్ : ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చి నిరుపేదల సొంతింటి కలలను సాకారం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లులు చెల్లించకపోవడంతో అబాసు పాలవుతుంది. ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకొని ఇందిరమ్మ ఇళ్ల బిల్లు కోసం ఎదురుచూస్తున్న మహిళకు అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఓ వితంతు నిరుపేద ఒంటరి మహిళా తాను కూలి నాలి చేసుకొని పోగేసుకున్న డబ్బులతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి ఇందిరమ్మ ఇంటి బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ ఫ్లెక్సీ కట్టి నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన మంగలి ఈశ్వరమ్మ అనే వితంతు ఒంటరి మహిళ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.


ఈమెకు సొంత ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడంతో గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి మంజూరైన ఇంద్రమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. కాగా లబ్ధిదారురాలు మంగలి ఈశ్వరమ్మ ప్రభుత్వ నిబంధనకు లోబడి బేస్మెంట్ వరకు నిర్మించారు. కాగా ఈ బీస్మెంటు నిర్మాణము పనిచేయదని నూతనంగా మరొక బీస్మెంటు నిర్మాణం చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య సూచించారు. దీంతో అప్పటివరకు ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అవుతాయి అనే ఉద్దేశంతో ఇంటిని పూర్తిగా నిర్మించానని ఇప్పటివరకు తన బంగారం అమ్మి రెండు లక్షల రూపాయలు, తన కూతురు బంగారం కుదువ పెట్టి రెండున్నర లక్షల రూపాయలు, డ్వాక్రా సంఘం నుంచి రెండు లక్షల రూపాయల రుణము తీసుకొని ఇప్పటివరకు సుమారు 7 లక్షల రూపాయలను ఖర్చు చేశానని నా స్తోమతకు మించి డబ్బులు ఖర్చు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. 7 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఇల్లు నిర్మించుకున్నప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఒక బిల్లు కూడా మంజూరు చేయకపోవడంతో అప్పుల పాలై తాను తీవ్రంగా నష్టపోతున్నానన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇందిరమ్మ ఇంటి బిల్లులను మంజూరు చేయించి ఆదుకోవాలని మంగలి ఈశ్వరమ్మ కోరారు.

Next Story