డ్రమ్ములను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

by Nallavelli.Anjaneyulu |

దిశ, భిక్కనూరు : హైవేపై స్పీడ్ కంట్రోల్ కోసం ఏర్పాటుచేసిన డ్రమ్ములను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొనగా జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన సంఘటన కామారెడ్డి

డ్రమ్ములను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
X

దిశ, భిక్కనూరు : హైవేపై స్పీడ్ కంట్రోల్ కోసం ఏర్పాటుచేసిన డ్రమ్ములను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొనగా జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలోని 44వ హైవేపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆదిలాబాద్ నుంచి బెంగళూరు కు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటుచేసిన ఇనుప డ్రమ్ముల ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు తగలకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎస్ ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా డ్రైవర్ బత్తుల రమేష్( మిర్యాలగూడ ) డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా 350 వచ్చింది. దీంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, బస్సును సీజ్ చేసి స్థానికస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ బాగా తాగాడన్న విషయం ప్రయాణికులకు తెలిసి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు మాత్రం దగ్గరుండి వేరే వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్ పంపించారు. అయితే ప్రమాదానికి కారణమైన బస్సును పక్కకు తప్పించి పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Next Story