- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ బస్సు
దిశ, కామారెడ్డి : ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలతో వరద ధాటికి జాతీయ రహదారి పై రోడ్డు కోతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా

X
దిశ, కామారెడ్డి : ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలతో వరద ధాటికి జాతీయ రహదారి పై రోడ్డు కోతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటన సోమవారం కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల బైపాస్ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు జాతీయ రహదారిపై అదుపు తప్పి ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తాపడిన చోట ఇటీవల వర్షాలకు రహదారి కోతకు గురైంది. దాంతో రోడ్డు పక్కన ఓ గుంతలో బస్సు బోల్తా పడింది. అయితే ఆ బస్సు నాగపూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






