మాజీ ఎమ్మెల్యే బిగాలకు తప్పిన ప్రమాదం

by Nallavelli.Anjaneyulu |

ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

మాజీ ఎమ్మెల్యే బిగాలకు తప్పిన ప్రమాదం
X

దిశ‌, భిక్క‌నూరు : ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో ని 44వ హైవేపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు వాహనాల్లో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు శనివారం బయలుదేరారు. అయితే కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్లగా.. వారి వెనకాలే ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే బిగాల వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనాన్ని లారీ 20 మీటర్ల దూరం లాక్కెళ్లి డివైడర్ ఎక్కించింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి గాయాలు తగలకుండా సేఫ్ గా బయటపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బిగాల కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనంలో ఎక్కి నిజామాబాద్ వెళ్లిపోయారు. భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలోని పోలీసులు హైవేపై ట్రాఫిక్ జాం కాకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Next Story