- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
దిశ, భిక్కనూరు : భార్య కాపురానికి రావడం లేదనే మనస్థాపంతో భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల పరిధిలోని

దిశ, భిక్కనూరు : భార్య కాపురానికి రావడం లేదనే మనస్థాపంతో భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల పరిధిలోని రామేశ్వర్ పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన మల్లాని రమేష్ (35) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 16 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన అనిలతో వివాహం జరిగింది. ఇక ఆ తర్వాత భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరగడంతో భర్త వద్ద ఉండలేక భార్య అనిల సంవత్సర క్రితం తన ముగ్గురు ఆడపిల్లల సంతానాన్ని వెంట బెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురవుతున్న రమేష్ తాగుడికి బానిసయ్యాడు. గత మూడు రోజుల క్రితం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రమేష్, ఇవాళ గ్రామంలోని ఆపారం చెరువులో శవమై తేలాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మృతదేహాన్ని వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.






