డివైడర్ పైకి దూసు కొచ్చిన భారీ కంటైనర్

by Ratna Kumari |

ఓ భారీ కంటైన‌ర్ డివైడ‌ర్ పైకి దూసుకొచ్చిన ఘ‌ట‌న భిక్క‌నూరు మండ‌లం సిద్ధ‌రామేశ్వ‌ర‌న‌గ‌ర్ గ్రామ స‌మీపంలో 44వ హైవే పై బుధ‌వారం చోటు చేసుకుంది.

డివైడర్ పైకి దూసు కొచ్చిన భారీ కంటైనర్
X

దిశ‌, భిక్క‌నూరు : ఓ భారీ కంటైన‌ర్ డివైడ‌ర్ పైకి దూసుకొచ్చిన ఘ‌ట‌న భిక్క‌నూరు మండ‌లం సిద్ధ‌రామేశ్వ‌ర‌న‌గ‌ర్ గ్రామ స‌మీపంలో 44వ హైవే పై బుధ‌వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హైద‌రాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఈ కంటైన‌ర్ ఒక్క‌సారిగా హైవే పై ఉన్న డివైడ‌ర్ పైకెక్కి రావ‌డంతో ప్రమాద సూచిక, హెచ్చరిక బోర్డులు పూర్తిగా ధ్వంసమై రోడ్డుకి ఇరువైపులా ఎక్కడిక‌క్కడ పడిపోయాయి. ఈ భయానక పరిస్థితులను చూసి రోడ్డుకిరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కంటైనర్ ముందు భాగం ధ్వంసం అయినప్పటికీ, దాంట్లో ప్రయాణిస్తున్న డ్రైవర్ క్లీనర్ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న జీఎంఆర్ హైవే సిబ్బందితోపాటు, స్థానిక పోలీసులు వెంటనే ఘటన స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Next Story