- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
జిల్లాలో వరుసగా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి దేవత విగ్రహం, బైకులు, సీసీ కెమెరాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి సబ్ డివిజనల్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.

దిశ, కామారెడ్డి : జిల్లాలో వరుసగా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి దేవత విగ్రహం, బైకులు, సీసీ కెమెరాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి సబ్ డివిజనల్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. మంగళవారం పలు దొంగతనాలకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాతో వివరించారు. ఈ నెల 22 రాత్రి భిక్కనూరు లోని ఓ గుడి తాళాలు పగులగొట్టి పంచలోహంతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం, అమ్మవారి మెడలో ఉన్న రెడీమేడ్ నగలు దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పారు. దీంతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టగా బిక్నూర్ టోల్ గేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తమ విచారణలో వారు పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. పట్టుబడిన వారిలో భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన మట్టె అచ్యుత్, కొక్కు గణేష్ ఉన్నారన్నారు.
ఈ నిందితుల పై భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధి 3 కేసులు ఉండగా ఇసన్నపల్లి గ్రామంలోని ఆలయంలో తాళం పగలగొట్టి హుండీ డబ్బులు, దేవత ఆభరణాలు దొంగతనం, బిక్నూర్ పెద్దమ్మ ఆలయంలో విగ్రహం, హుండీ డబ్బులు, నగలు, సీసీ కెమెరాలు దొంగతనం, కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మోటార్ సైకిల్ దొంగతనం, రైల్వే గేట్ సమీపంలో మోటార్ సైకిల్ దొంగతనం, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో చిల్లర డబ్బులు, దేవత కండ్లు దొంగతనం చేసిన కేసులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి ఫ్యాషన్ ప్రో బైకు, పల్సర్ మోటార్ సైకిల్, ఇత్తడి విగ్రహం (పెద్దిరాజు), రెండు సీసీ కెమెరాలు, 5.రోల్డ్ గోల్డ్ చైన్లు, 5 జతల దేవత కండ్లు, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.






