- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెరవేరిన స్వప్నం.. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు
నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది.

దిశ, తాడ్వాయి: నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. రూ.200 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకమైన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రధాన కార్యదర్శి యోగితారాణా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక వరం లాంటిదని, ఇది ఈ ప్రాంత విద్యాభివృద్ధికి, తద్వారా సమగ్ర అభివృద్ధికి పునాది వేస్తుందని విద్యా రంగ నిపుణులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గ ప్రజల విద్యావసరాలను గుర్తించి, ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆయన ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులను ఎమ్మెల్యే మదన్ మోహన్ పలుమార్లు కలిసి, ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు.ఆయన అకుంఠిత కృషి, పట్టుదల ఫలితంగానే ఈ బృహత్తర ప్రాజెక్టు ఎల్లారెడ్డికి మంజూరైందని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా రూ. 70 కోట్లతో ఐటీఐ కళాశాలను, అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)గా అభివృద్ధి చేయాలని సంకల్పించి ఆ మేరకు నిర్మాణ పనుల్ని చేపట్టారు. ఈ పనులు పూర్తయితే పేద విద్యార్థులకు అత్యాధునికమైన ప్రాక్టికల్ శిక్షణ అందుబాటులోకి వస్తుంది.
ఇవే ప్రత్యేకతలు..
‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ కేవలం ఒక పాఠశాల మాత్రమే కాదు, ఇది ఒక సమగ్ర విద్యా కేంద్రం. రూ.200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మితం కానున్న ఈ పాఠశాలలో ఆధునిక విద్యా బోధనా పద్ధతులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉండనున్నాయి. ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య అందనుంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బోధనా ప్రమాణాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. అంతే కాకుండా సమగ్ర విద్యా విధానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాల వంటి శిక్షణ అంశాలపై దృష్టి సారించబడుతుంది.
స్థానికులకు మెండుగా ఉపాధి అవకాశాలు..
ఈ పాఠశాలతో విద్యనభ్యసించిన స్థానికులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా లభించనున్నాయి. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకంలో స్థానికులకు ప్రాధాన్యత లభిస్తుంది. దీంతో ఆ ప్రాంతీయ అభివృద్ధి విద్యా కేంద్రాలు ఒక ప్రాంత అభివృద్ధికి ఎలా తోడ్పడతాయో, ఈ పాఠశాల కూడా ఎల్లారెడ్డి ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది పరిశ్రమలు, వ్యాపార సంస్థలను ఆకర్షించే అవకాశం ఎంతగానో ఉంది.
ఎమ్మెల్యే పనితనానికి నిదర్శనం.. బుర్ర నారాగౌడ్, లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు నిరుపేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారనడానికి నిదర్శనమే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు. స్కూల్‌ను మా లింగంపేట్ మండలం మోతె గ్రామంలో ఏర్పాటు చేయడం మాకెంత్ గర్వ కారణం. ఇంతకు ముందు ఎందరో చాలా మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు. మంత్రులుగా కూడా పని చేశారు. కానీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదు. మా మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు.
భవిష్యత్ తరాల విద్యాభివృద్ధికి ఎంతో ఉపయోగం: రాంరెడ్డి, తాజా మాజీ సర్పంచ్, మోతె గ్రామం
మా ఊళ్లో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుతో భవిష్యత్తు తరాల విద్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. నిరుపేద విద్యార్థులకు నిజంగా ఇదొక వరం. ఎందరో విద్యార్థులు నాణ్యమైన, విలువైన విద్యను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.






