- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల పై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.

దిశ, నాగిరెడ్డిపేట్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా మండలంలోని మెల్ల కుంట తండా ఉపసర్పంచ్ ను ఎన్నుకునే క్రమంలో పోలింగ్ బూత్ వద్ద మహాదేవునిగడ్డ తాండ కు చెందిన గ్రామస్థులు ఆందోళనకు దిగి, పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పై దురుసుగా మాట్లాడి, వారి విధులకు ఆటంకం కలిగించి పోలీస్ సిబ్బందిపై దాడి చెయ్యడంతో మహాదేవునిగడ్డ తాండ కు చెందిన రమావత్ సురేష్, రామావత్ శ్రీనివాస్, రమావత్ రోహిత్ అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.






