- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లపై కేసు నమోదు
దిశ, నిజాంసాగర్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో

X
దిశ, నిజాంసాగర్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అచ్చంపేట గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్, సోమవారం ఉదయం మాగి గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్ ల ద్వారా గ్రామ శివారులో గల మంజీరా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సైతం జప్తు చేసుకుంటామని ఎస్ఐ వెల్లడించారు.
Next Story






