- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిపై కేసు
by Ratna Kumari |
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తి పై బుధవారం సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ పవన్ కేసు నమోదు చేశారు. మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం సందులో నివాసం ఉంటున్న కావలి యాదగిరి అనే వ్యక్తి గ్యాస్ స్టవ్ రిపేరింగ్ చేస్తుంటాడు.

X
దిశ, కమ్మర్ పల్లి : అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తి పై బుధవారం సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ పవన్ కేసు నమోదు చేశారు. మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం సందులో నివాసం ఉంటున్న కావలి యాదగిరి అనే వ్యక్తి గ్యాస్ స్టవ్ రిపేరింగ్ చేస్తుంటాడు. కొంతకాలంగా అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి మినీ సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు బుధవారం దాడులు జరిపారు. ప్రమాదకరమైన రీతిలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిర్వాహకుడు యాదగిరి వద్ద నుంచి ఐదుగురు సీజ్ చేసి కేసు నమోదు చేసి, గ్యాస్ గోదాంకి అప్పగించినట్టు తెలిపారు. నివేదికను జిల్లా అడిషనల్ కలెక్టర్ కి నివేదిక పంపినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్ కుమార్, జీపీఓలు కే. అశోక్, పి. అజయ్, దేవరాజులు పాల్గొన్నారు.
Next Story






