- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్తు పదార్థాల రహిత సమాజం కోసం బైకు యాత్ర
దిశ, కామారెడ్డి : మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం తనవంతు ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా బైకు యాత్ర చేస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. సూర్యాపేటకు చెందిన

దిశ, కామారెడ్డి : మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం తనవంతు ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా బైకు యాత్ర చేస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త జనచైతన్య బైక్ యాత్ర మంగళవారం మధ్యాహ్నం కామారెడ్డి పట్టణానికి చేరుకుంది. బైక్ యాత్రకు స్థానిక ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, స్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబీర్ శ్యామ్ రావు స్వాగతం పలికి ఉపాధ్యాయుడు ప్రభాకర్ ను సన్మానించారు. ఏఎస్పీ చైతన్య రెడ్డిని కలవడానికి ప్రయత్నించగా.. ఆమె అందుబాటులో లేరు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. తన స్నేహితుడు విపరీతమైన ధూమపాననికి అలవాటు పడి మృతి చెందాడని, దానికి తాను కలత చెందానన్నారు. అతనికి జరిగినట్టుగా మరొకరికి జరగకూడదని జనచైతన్య బైక్ యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ తన యాత్రకు జెండా ఊపి ప్రారంభించారని, ఇప్పటివరకు వివిధ జిల్లాలో 1800 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసినట్టు తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో తన యాత్ర పూర్తవుతుందన్నారు. గతంలో మహా నగరాలకు మాత్రమే పరిమితమైన డ్రంగ్స్, గంజాయి పచ్చని పల్లెలకు వ్యాపించి ప్రశాంతత లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత వీటికి అలవాటు పడి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుని తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులకు సహకరిస్తూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు.






