ఆర్టీసీ బ‌స్సుకు త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బాన్సువాడ : సాధార‌ణంగా ఈ మ‌ధ్య కాలంలో నిత్యం ఎక్క‌డో ఒక చోట ఆర్టీసీ బ‌స్సులు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. ఆర్టీసీ ఎంత ఎక్స్ ప‌ర్ట్ డ్రైవ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ

ఆర్టీసీ బ‌స్సుకు త‌ప్పిన పెను ప్ర‌మాదం..!
X

దిశ‌, బాన్సువాడ : సాధార‌ణంగా ఈ మ‌ధ్య కాలంలో నిత్యం ఎక్క‌డో ఒక చోట ఆర్టీసీ బ‌స్సులు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. ఆర్టీసీ ఎంత ఎక్స్ ప‌ర్ట్ డ్రైవ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌మాదాలు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా బాన్సువాడ మున్సిపాలిటీ ప‌రిదిలోని 10వ నెంబ‌ర్ కెనాల్ లో ఆర్టీసీ బ‌స్సుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి వెళ్తుండ‌గా స్టీరింగ్ లెప్ట్ సైడ్ గుంజ‌డంతో బ‌స్సు డివైడ‌ర్ పైకి వెళ్లింద‌ని డ్రైవ‌ర్ శ్రీనివాస్ తెలిపాడు. బ‌స్సు ముంద‌ర ఉన్న‌టువంటి రెండు టైర్లు కూడా ఊడిపోవ‌డం గ‌మ‌నార్హం. బ‌స్సులో ఉన్న‌టువంటి సుమారు 20 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. కండెక్ట‌ర్, డ్రైవ‌ర్ తో క‌లిసి దాదాపు 11 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరూ చిన్నారుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. 11 మంది ఏరియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ప్రాణ‌పాయం లేద‌ని డాక్ట‌ర్ శ్రీను నాయ‌క్ తెలిపారు.

Next Story