- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్నం భోజనం వికటించి 8 మంది విద్యార్థులకు అస్వస్థత
మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మండలంలోని మాల్తుమ్మెద బాలుర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది.

దిశ, నాగిరెడ్డిపేట్ : మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మండలంలోని మాల్తుమ్మెద బాలుర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మాల్ తుమ్మెద గ్రామంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం 54 మంది విద్యార్థులకు 48 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన సమయంలో మధ్యాహ్న భోజనం భుజించిన ఐదవ తరగతికి చెందిన ఆదర్శ ప్రేమ్, సాయి తేజ, దుర్గాప్రసాద్, ప్రవీణ్, రోహిత్, క్లేమంత్, హరి ప్రీత్, నాలుగవ తరగతికి చెందిన శశివర్ధన్ అనే 8 మంది విద్యార్థులు కడుపు నొప్పిగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ తులసికి చెప్పారు. వెంటనే ఆమె స్థానికుల సహాయంతో 108 వాహనంలో విద్యార్థులను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డివో పార్ధసింహారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నమూనాలను ప్రయోగశాలకు పంపి, విద్యార్థుల అస్వస్థతకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపడంతో వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ తులసి తెలిపారు.






