- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజు 58 మందికి శిక్షలు
దిశ, కామారెడ్డి : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకేరోజు 58 మందికి కోర్టు శిక్షలు విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో మద్యం

దిశ, కామారెడ్డి : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకేరోజు 58 మందికి కోర్టు శిక్షలు విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కారణమవుతున్నారన్నారు. కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపినవారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా, ఎన్నో కుటుంబాలు దాని వల్ల రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వాహనదారులను కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయమూర్తుల ఎదుట హాజరుచేయడం ద్వారా జైలు శిక్షలు లేదా జరిమానాలు విధించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు 58 మందికి శిక్షలు విధించినట్లు చెప్పారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మందికి జైలు శిక్ష (నలుగురికి 2 రోజుల జైలు, ఆరుగురుకి 1 రోజు జైలు శిక్ష, ₹1000 జరిమానా ఒక్కోరికి), దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి 2 రోజుల జైలు, 1000 జరిమానా, మాచారెడ్డి, కామారెడ్డి, బిక్నూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరికి 1 రోజు జైలు, 1000 జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే 44 మందికి 1000 చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు.






