మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిపిన 242 మంది పై కేసుల న‌మోదు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిపిన 242 మంది పై కేసులు న‌మోదు అయిన‌ట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిపిన 242 మంది పై కేసుల న‌మోదు
X

దిశ, కామారెడ్డి : మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిపిన 242 మంది పై కేసులు న‌మోదు అయిన‌ట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబ‌ర్ 31న రాత్రి 8 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 01 ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు పోలీసులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌ద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా.. 242 మంది వాహనదారులు పట్టుబడ్డారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసులు ముందుగానే చెప్పినట్లుగా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినప్పటికీ.. వారి హెచ్చరికలను పట్టించుకోకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసుల నమోదు చేశారు.

Next Story